ముగింపును మొదలెట్టేసిన బాలకృష్ణ..!

నట సింహం నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే మొరాకోలో మొదటి షెడ్యూల్ ను, హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దాగ్గర వేసిన ఓడ సెట్లో రెండో షెడ్యూల్ ను జరుపుకున్న ఈ సినిమా, మూడో షెడ్యూల్ కోసం జార్జియా వెళ్ళనుంది. అక్కడ ఈ చిత్ర క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నారు. 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో శాతవాహనులకు, గ్రీకులకు మధ్య యుద్ద సన్నివేశాలను క్లైమాక్స్ లో భాగంగా భారీగా తీయనున్నారు. జూన్ 4 నుండి జార్జియాలోని మౌంట్ కజ్ దగ్గర చిత్రీకరించనున్నారు. ఈ ప్రాంతం రష్యాకు దగ్గరలో ఉంటుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వై. రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మాతలు.

Leave a Reply