తెలంగాణ మరో ఘనత

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భద్రతను ఉద్దేశించి రూపొందించిన హాక్ ఐ మొబైల్ అప్లికేషన్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించింది. ప్రజల రక్షణకు డేగ కన్ను లాగ చూస్తుంది అనే అర్థం వచ్చేలా ఈ అప్లికేషన్ కు హాక్ ఐ అనే పేరు పెట్టారు. అందుకు తగ్గాట్లుగానే హాక్ ఐ అప్లికేషన్ ద్వారా సామాన్య ప్రజలు సైతం తమకు దగ్గరలో ఎదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా, నేరాలు జరుగుతున్నా, ఈవ్ టీజింగ్ జరుగుతున్నా, ఈ అప్లికేషన్ ద్వారా పిర్యాదు చేయవచ్చు. అలాగే పోలీసులు ఎవరైనా చట్టం అతిక్రమించినా సామాన్య పౌరులు వాటిని సాక్ష్యంతో సహా పిర్యాదు చేయవచ్చు. పిర్యాదు అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. సాధారణ పౌరులు సైతం కమ్యూనిటీ పోలిసింగ్ సభ్యులుగా చేరడానికి హాక్ ఐ అప్లికేషన్ సహాయపడుతుంది. ప్రజల్ని సివిల్ దుస్తుల్లో ఉన్న పోలిసులుగా చేరడానికి అవకాశం ఇచ్చారు. ఇన్ని ప్రత్యకతలు కలిగి ఉన్న హాక్ ఐ అప్లికేషన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 7వ ఎంబిలియంత్ సౌత్ ఏషియా గలా పోటిలలో ఫైనల్ కు చేరుకుంది. సార్క్ దేశాలలో ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి అనే అంశంపై పోటి నిర్వహించారు. ఈ పోటిలకు 8 దేశాల నుండి 348 ఎంట్రీలు వచ్చాయి. వాటిలో హాక్ ఐ అప్లికేషన్ ఫైనల్ కు చేరుకుందని  ఎంబిలియంత్ ప్రతినిధులు నగర పోలీసులు అభినందనలు తెలుపుతూ లేఖ పంపించారు. ఈ నెల 23వ తేదిన న్యూఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం జరగబోతుంది.

Leave a Reply