మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన హై కోర్ట్..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో సారి హై కోర్ట్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ కోసం ప్రభుత్వం జీవో 123ను విడుదల చేసింది అయితే ఈ జీవోపై వట్టెం గ్రామ ప్రజలు హై కోర్ట్ కు వెళ్ళారు. దానిపై విచారించిన హై కోర్ట్ భూసేకరణ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే  ప్రభుత్వాన్ని, ప్రజలను ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించింది. ఖాళీ బాండ్ పేపర్ లపై ఎందుకు సంతకాలు చేయించుకుంటున్నారని ప్రభుత్వాన్ని హై కోర్ట్ ప్రశ్నించింది. భూములు కోల్పోతున్న రైతుల అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలించాలని అప్పటివరకు భూసేకరణ కార్యకమం నిలిపివేయాలని,వట్టెం గ్రామ ప్రజలు ఎకరానికి 20-25 లక్షలు డిమాండ్ చేస్తున్నారు అని, ప్రభుత్వం వారితో సామరస్యంగా చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలి అని హై కోర్ట్ సూచించింది.

Leave a Reply