పాక్ హిజ్బుల్ ముజాహుద్దీన్ సంచలన వ్యాఖ్యాలు..

పాకిస్తాన్ కు చెందిన హిజ్బుల్ ముజాహుద్దీన్ తీవ్రవాద సంస్థ భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గత నెలలో భారత్ లో హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ ను ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతిగా కాశ్మీర్ లో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై హిజ్బుల్ ముజాహుద్దీన్ చీఫ్ సయిద్ సలాహుద్దీన్ స్పందించాడు. కాశ్మీర్ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారని, వారికి మద్దతు ఇవ్వడానికి పాకిస్థాన్ సిద్దంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచం పట్టించుకోకపోయినా, ఐక్యరాజ్యసమితి చూడకున్నా, కాశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ అండగా ఉంటుందని, అందుకోసం అవసరమైతే భారత్ తో అణు యుద్దానికైనా సిద్దమేనని ప్రకటించారు. ఇప్పటికే భారత్ – పాకిస్థాన్ మధ్య మూడు యుద్దాలు జరిగాయని మరో యుద్ధం జరిగేందుకు అవకాశం ఉందని పేర్కొన్నాడు. భారత్ తన వైఖరి మార్చోకోకపోతే నాలుగో ప్రపంచ యుద్ధం వస్తుందని వ్యాఖ్యానించారు.

Leave a Reply