సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న ‘ఐ హేట్ హీరోస్ వీడియో’

మనలో చాలామందికి ఒక హీరోపై అభిమానం ఉండడం ఎంత సహజమో అదే స్థాయిలో మన అభిమాన హీరోను వేరే వాళ్లు విమర్శిస్తే ఆవేశం రావడం అంతే సహజం. అయితే యుట్యూబ్ లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ఓక వీడియోను చూస్తే మాత్రం అందరు అభిమానులకు కోపం రావడం చాలా సహజం. చిరంజీవి నుండి ప్రభాస్ వరకు అందరు హీరోల పోస్టర్స్ ను తగులబెట్టేశారు ఆ వీడియోలో. చిరంజీవి సొంతగా హీరో అయ్యి, ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలను మోసం చేశాడు అంటూ సాగే ఈ పాటలో అందరు హీరోలో బ్యాక్ గ్రౌండ్ తోటే పైకోచ్చారంటూ, సంపుర్నేష్ బాబు మాత్రం యాక్టింగ్,డాన్సులు రాకున్నా స్టార్ అయిపోయాడు అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఈ వీడియో చుసిన నెటిజెన్లు మాత్రం వారిపై మండిపడుతున్నారు. కొంతమంది మాత్రం వారికి మద్దతుగా నిలుస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇది పుబ్లిసిటీ స్టంట్ అంటూ తీసి పారేస్తున్నారు.

Leave a Reply