ఇస్లాం శాంతిని కోరుకుంటుంది – జకీర్ నాయక్

ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ పై గత కొన్ని రోజులుగా వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లోని ఢాకాలో విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులు, తాము జకీర్ నాయక్ ప్రసంగాలతోనే స్పూర్తి పొందాము అని ప్రకటించడంతో వివాదం మొదలైంది. అయితే ఈ వివాదం పై స్పందించేందుకు జకీర్ నాయక్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. అయితే నేరుగా కాకుండా స్కైప్ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. 25 సంవత్సరాలుగా మత బోధనలు చేస్తున్నానని, అయితే ఉగ్రవాదం వైపు వెళ్ళాలని ముస్లింలకు తాను ఎప్పుడు చెప్పలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని జకీర్ నాయక్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తాను ఏ మాత్రం సమర్థించను అని, ఏ ఉగ్రదాడిలో కూడా తన ప్రమేయం లేదని జకీర్ నాయక్ వివరించారు. ఇస్లాం శాంతిని కోరుకుంటుంది అని, ఫ్రాన్సులో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నాను అని జకీర్ నాయక్ తెలిపారు.

Leave a Reply