సంపన్న దేశాల సరసన భారత్..

భారత్ ఇక ఎంత మాత్రం పేద దేశం కాదు. కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ ఎంతో సంపన్న దేశం ఈ మాట అంటున్నది న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక. నివేదిక సారాంశం ప్రకారం భారత దేశంలోని మొత్తం వ్యక్తిగత సంపద 5600 బిలియన్ డాలర్లు అంటే 5 లక్షల 60 వేల కోట్ల డాలర్లు. సంపన్న దేశాల జాబితాలో భారత్ 7వ స్థానంలో నిలిచింది. 48900 బిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో, 17400 బిలియన్ డాలర్లతో చైనా రెండవస్థానంలో, 15100 బిలియన్ డాలర్లతో జపాన్ మూడవ స్థానంలో, 9200 బిలియన్ డాలర్లతో యూకే నాలుగో స్థానంలో, 9100 డాలర్లతో జర్మనీ ఐదో స్థానంలో, 6600 ఫ్రాన్స్ ఆరో స్థానంలో నిలిచాయి. ఈ నివేదికలో అప్పులను పరిగణలోకి తీసుకొనలేదు. అయితే భారత దేశ జనాభే అత్యంత సంపన్న దేశాల సరసన నిలవడానికి కారణం అని నివేదిక పేర్కొంది.

Leave a Reply