అభివృద్ధి లక్ష్యాలను చేరుకోలేక పోవటమే కారణం..

భారత్ స్థిరాభివృద్ధిలో వెనుకబడుతున్నట్లే కనబడుతుంది. అందుకు స్థిరాభివృద్ధికి సంభందించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం అవుతుండడమే కారణం అని తెలుస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అండ్ ది బెర్టేల్స్ మాన్ స్టిఫ్టంగ్ తాజాగా విడుదల చేసిన సుచీలో  భారత్ 110వ స్థానంలో నిలిచింది. మొత్తం 140 దేశాల్లో, 17 గ్లోబల్ గోల్స్ అంశాలపై చేసిన సర్వేలో స్వీడన్ కు మొదటి స్థానం లభించింది. ఆ తర్వాత డెన్మార్క్, నార్వే దేశాలు ఉన్నాయి. చైనా 76వ స్థానంలో, పాకిస్తాన్ 115వ స్థానంలోఉన్నాయి. ఆఖరి స్థానం లైబీరియాకు దక్కింది.

Leave a Reply