బంపర్ ఆఫర్ ప్రకటించిన ఇండిగో ఎయిర్ లైన్స్..

విమానంలో ప్రయాణించడం అనేది సామాన్య మధ్య తరగతి ప్రజలకు కల. అయితే ఇండిగో ఎయిర్ లైన్స్ అటువంటి వారి కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అది మొత్తం విమానయాన చరిత్రలోనే ఒక అద్బుతమైన ఆఫర్ గా చెప్పుకొనవచ్చు. అదేమిటంటే ఇండిగో ప్రారంభమై 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ‘ది 6ఈ ఎక్స్ ప్లోరర్’ పేరుతో ఎంపిక చేసిన కొంతమంది ప్రయాణికులకు ఇండిగో విమానాల్లో ఉచితంగా విహరించే అవకాశం కల్పిస్తారు. వారిని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్ళి భోజనం, వసతి సౌకర్యాలను కల్పిస్తారు. అంతేకాకుండా వారి అనుభవాలను ఇండిగో వెబ్ సైట్ లో ప్రచురిస్తారు.

అందుకోసం ప్రయాణించాలి అనుకునే వారు ముందుగా చేయాల్సింది https://www.goindigo.in/6e-explorer  అనే వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా విడుదల చేస్తారు. ఎంపికైన వారిని డిసెంబర్ 31 లోపు టూర్ కు తీసుకువెళ్తారు. ఆగష్టు 5 నుండి ప్రారంభం అయిన ఈ రిజిస్ట్రేషన్ లు అక్టోబర్ 5 వరకు కొనసాగుతాయి.

Leave a Reply