కబాలిలో దర్శనమిస్తున్న జూనియర్ ఎన్టీఆర్..

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం కబాలి ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదల అయ్యింది. భారి అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి వెళ్ళిన తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు, మలయాళీ ప్రేక్షకులకు మరో సర్ ప్రైజ్ థియేటర్లలో దర్శనం ఇచ్చింది. అదేమీ టంటే జూనియర్ ఎన్టీఆర్, మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలిసి నటిస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్ర టీజర్ ఇప్పటికే విడుదలై ఆన్ లైన్ లో సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పుడు తాజాగా కబాలి విడుదల అయిన ధియేటర్ లలో జనతా గ్యారేజ్ టీజర్ వేస్తున్నారు. దాంతో మూడు రాష్ట్రాల్లో ధియేటర్ లు హోరెత్తి పోతున్నాయి. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. సమంతా హీరోయిన్ గా నటిస్తుంది.

Leave a Reply