సంచలనం సృష్టిస్తున్న ఫోన్ కాల్ రికార్డు..జనతా గ్యారేజ్ విషయంలో..

నిన్న టాలీవుడ్ లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ చిత్రానికి ప్రేక్షకులతో పాటు, విమర్శకులు కూడా చిత్రం బావుందని చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చిత్రం పై పూర్తిగా వ్యతిరేక వార్తలు వెలువడుతున్నాయి. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఒక విషయంలో ఆలోచిస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరైనా నెగటివ్ పబ్లిసిటీ  చేసే ప్రయత్నం చేస్తున్నారా అని ఆరా తీసే పనిలో ఉన్నట్లు సమాచారం.. ఇలా ఆరా తీయడానికి కారణం లేకపోలేదు.ఎందుకంటే సినిమాలు రిలీజ్ కు ముందే మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కొన్నిసార్లు అందరికి ఒకే అభిప్రాయం ఉండటం లేదు. ఈ విషయం ఆయా ఆన్ లైన్ వెబ్సైటులలో కూడా సమీక్షల పేరుతో తమ అభిప్రాయాలను చెబుతున్నారు.అలా చెప్పేందుకు ఎవరు అడ్డుపడరు కానీ కొన్ని సినిమాల విషయంలో ఒక వెబ్సైటు లో పూర్తిగా బాగుందని రాస్తే మరికొన్ని వెబ్సైటులలో పూర్తి విరుద్దంగా రాస్తున్నారు. అయితే అలా ఎందుకు రాస్తారు..? రాసేవాళ్ళు నిజంగా సినిమా చూసే రాస్తున్నారా? సమీక్షల పేరుతో వ్యాపారం చేస్తున్నారా? అనేది ప్రధాన సందేహం. ఈ మధ్య సినిమాల పోటీ విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. ఒకప్పుడు సినిమా ఫ్లాప్ అయితే దాని ప్రభావం సినిమా కలెక్షన్లపై పడేందుకు కొంత సమయం పడేది. అదే ఇప్పుడు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే మరుసటి షో నుండే కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. కొంత మంది పనిగట్టుకొని మరి సినిమాలపై విష ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు ఎప్పటి నుండో వస్తున్నాయి. అందుకోసం కొన్ని కంపెనీలు కూడా పని చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.అయితే ఇందుకు నిజమే అనే సమాధానాన్ని ఇస్తూ సంచలన విషయం ఇవాళ బయటికొచ్చింది.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్న శివాయ్  చిత్రానికి నెగటివ్ ప్రచారాన్ని చేయాలంటూ, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సిని విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ కు 25 లక్షలు ఇచ్చాడంటూ వస్తున్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కమల్ ఆర్ ఖాన్, శివాయ్ నిర్మాత మంగత్ తో ఫోన్ లో మాట్లాడుతూ తనకు చిత్రంపై విష ప్రచారం చేయాలంటూ 25 లక్షలు ఇచ్చారంటూ ఫోన్ లో చెప్పాడు. ఆ కాల్ ను నిర్మాత మంగత్ రికార్డు చేశారు. ఆ ఆడియో రికార్డును అజయ్ దేవగన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు బాలీవుడ్ లో ప్రకంపంనలు సృష్టిస్తున్నాది.

అయితే నిన్న టాలీవుడ్ లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ చిత్రానికి ప్రేక్షకులతో పాటు, విమర్శకులు కూడా చిత్రం బావుందని చెప్తున్నారు. అయితే  పలు వెబ్ సైట్లలో , సోషల్ మీడియాలో చిత్రం పై పూర్తిగా వ్యతిరేక వార్తలు వెలువడుతున్నాయి. దాంతో ఎన్టీఆర్ అభిమానులు శివాయ్ చిత్రానికి చేసినట్లు ఈ చిత్రానికి కూడా ఎవరైనా నెగటివ్ పబ్లిసిటీ  చేసారా అని సందేహిస్తున్నారు.

ఏది ఎలా ఉన్నా సినిమా బాగుంటే అది ఎవరికయినా నచ్చుతుంది. బాగోలేనప్పుడు ఎంత బాగా పబ్లిసిటీ చేసినా ప్రేక్షకుడి దగ్గర తప్పకుండా విఫలం అవుతుంది. ఏదైనా ప్రేక్షకుడిని ఆనందించేలా చేయడానికి సినిమాలు తీస్తారు.అంతే కానీ నిరుత్సాహ పరచాలని కాదు అనే విషయం గమనించాలి.

శివాయ్ సినిమాకు సంబంధించి ఆడియో టేపు లీకు అయిందని ఆ విషయాన్ని స్వయంగా అజయ్ దేవగన్ ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేసారు.

 

Leave a Reply