ప్రకృతిని ప్రేమిద్దాం అంటున్న ఎన్టీఆర్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రకృతిని కాపాడుకోవటానికి చేపట్టిన కార్యక్రమాలు హరితహారం, మనం-వనం. ఈ కార్యక్రమాల్లో పలువురు సినీ నటులు పాల్గొని తమవంతుగా చెట్లను నాటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన నూతన చిత్రం జనతా గ్యారేజ్ ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు సిద్దం అయ్యారు. ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ తన గత చిత్రాల్లో మనుషులను ప్రేమిద్దాం, మన గ్రామాలను ప్రేమిద్దాం అంటూ చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ప్రకృతిని ప్రేమిద్దాం అంటూ మరొక సందేశాత్మక చిత్రానికి కమర్షియల్ హంగులు జోడించి మన ముందుకు వస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది.

Leave a Reply