వాయిదా పడ్డ జనతా గ్యారేజ్..

టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి హిట్ చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానులే కాదు, తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఎదురు చూస్తుంది. సమంత హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో, మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని ఆగష్టు 12న విడుదల చేయాలి అనుకున్నారు. అయితే చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేకపోవటం, వంటి కారణాలతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2వ తేదికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. జూలై 22న జనతా గ్యారేజ్ ఆడియో వేడుక జరిగే అవకాశం ఉంది. అయితే జనతా గ్యారేజ్ ఆగష్టు 12న విడుదల అవుతుంది అనుకోని వాయిదా వేసిన కొన్ని సినిమాలు ముందుగానే విడుదల అయ్యే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా వెంకటేష్ నటించిన బాబు బంగారం చిత్రం ఆగష్టు 12న విడుదల అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply