ఎన్టీఆర్ సినిమాకు ఇంటరెస్టింగ్ టైటిల్..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటించిన జనతా గ్యారేజ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తున్నట్లు ఇది వరకే చిత్ర నిర్మాత నందమూరి కళ్యాణ్ రాం ప్రకటించారు. చిత్రం ఫస్ట్ లుక్ సైతం విడుదల చేశారు. వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే ఈ చిత్రానికి ఇంటరెస్టింగ్ టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘దడ్కన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు. టైటిల్ విన్న ఎన్టీఆర్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply