తన పేరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న సందర్భంగా చిత్ర ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా తన పేరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను తారక్ అని పిలిస్తేనే ఇష్టమని, తనను ఎవరు ఎన్టీఆర్ అని పిలవద్దని కోరుకుంటానని తెలిపారు. ఎన్టీఆర్ అనేది మహానుభావుడైన తన తాత పేరని ఆయన సాధించిన దానిలో ఒక్క శాతం కూడా తాను ఇప్పటి వరకు సాధించలేదని, ఎవరైనా ఆ పేరుతో పిలిస్తే తనకు భయమేస్తుదని జూనియర్ ఎన్టీఅర్ పేర్కొన్నారు.

Leave a Reply