కబాలి ఆడియో విడుదల తేదిని ప్రకటించిన చిత్ర బృందం..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కబాలి. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకుడు. రజనీకాంత్ గత చిత్రం లింగ ఫ్లాప్ అవడంతో ఈ చిత్రం పై అభిమానుల్లో చాలా అంచనాలున్నాయి. ద్వి భాష చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక తెలుగులో  ఈ చిత్ర ఆడియోను ఈ నెల 26న నిర్వాహించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఆడియోను తమిళంలో లాగా డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేస్తా రా లేక ఫంక్షన్ నిర్వహించి విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే నటిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్. థాను నిర్మాత.

Leave a Reply