కడప కింగ్ అనే సినిమా తీస్తే 100 డేస్ 200 సెంటర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎస్ జే. సూర్య దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హుషారు అనే వర్కింగ్ టైటిల్ వాడుకలో ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమాగా తెలుస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్ర నిర్మాత శరత్ మరార్ కడప కింగ్ అనే టైటిల్ ను ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించారు. అది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా కోసమా లేక మరేదైనా సినిమా కోసమా అన్నది తెలియాల్సి ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ లో విడుదల కాబోతుంది.అయితే ఈ టైటిల్ వెనుక అంతర్యం ఏమున్నా పూరి సినిమా పోకిరిలో షాయాజీ షిండే డైలాగు గుర్తొస్తుంది. మహాత్మా గాంధీ పేరు మీద సినిమా చేస్తే ఎవరు చూడరు.కడప కింగ్ అనే సినిమా తీస్తే 100 డేస్ 200 సెంటర్స్ అని అంటారు కదా. అవును మాస్ ఎంటర్టైన్మెంట్ అంతే టాలీవుడ్ లో అంత క్రేజ్ మరి. ఈ టైటిల్ ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Leave a Reply