బంపర్ ఆఫర్ పట్టేసిన కాజల్ అగర్వాల్

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో హీరోగా నటిస్తున్నారు. సమంత, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో మలయాళం హీరో ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలతో వస్తున్న ఈ చిత్రంలో మరో స్పెషల్ అట్రాక్షన్ ఉండబోతుంది. అదేమిటంటే ప్రముఖ హీరొయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేయనున్నారు. అందుకోసం ముందుగా తమన్నాను అనుకున్నప్పటికీ ఆమెకు డేట్లు సర్దుబాటు కాలేక పోవటంతో తమన్నా స్థానంలో కాజల్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాజల్, ఎన్టీఆర్  సరసన నటించిన బృందావనం, బాద్ షా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అయితే అభిమానులకు పండగే.

Leave a Reply