మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తారా..?

తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ నేతలైన మాజీ ఎంపి వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమెల్యేలు భాస్కర్ రావు, రవీంద్ర నాయక్, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డిలు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెసిఆర్ కాంగ్రెస్, టిడిపిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదట్లోనే ప్రభుత్వాన్ని కూల్చి,రాష్ట్రపతి పాలన తేవడానికి కాంగ్రెస్,తెదేపాలు ప్రయత్నం చేశాయని అయితే ఆ సమయంలో ఎంఐఎం అదినేత అసదుద్దీన్ ఓవైసి తమకు అండగా నిలిచారని కెసిఆర్ పేర్కొన్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు కుడా తమను హెచ్చరించాయని కెసిఆర్ తెలిపారు. బెర్లిన్ గోడ పగిలినట్టు రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగి కలుస్తాయని చంద్రబాబు గతంలో అన్నాడని, అందుకు తగ్గట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఓక విఫల రాష్ట్రంగా చేయడానికి చంద్రబాబు, కాంగ్రెస్ తో కలిసి కుట్ర పన్నాడని కెసిఆర్ ఆరోపించారు. గతంలో తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ లో చేరినప్పుడు మౌనంగా ఉన్న జానారెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడని, మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అని కెసిఆర్ ప్రశ్నించారు.

Leave a Reply