జూరాలకు చేరుతున్న కృష్ణా నీరు..

రెండేళ్ళుగా తెలంగాణలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న తరుణంలో, రాష్ట్రంలోని రైతాంగం నీటి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించి, తెలంగాణ రాష్ట్రంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. మహబూబ్ నగర్ జిల్లా మాగనూర్ మండలం తంగడి గ్రామం వద్ద కృష్ణా జలాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారి వర్షాలకు కర్నాటకలోని ఆల్మట్టి డ్యాం నిండడంతో ఆ నీటిని నారాయణపూర్ డ్యాంకు వదిలారు. అది కూడా నిండడంతో రాష్ట్రంలోని జూరాలకు నీటిని విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం వరకు జూరాలకు కృష్ణా నీరు చేరే అవకాశం ఉంది. 11 టీఎంసీల సామర్థ్యం గల జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే జూరాలకు ఎంత నీరు వస్తుందో అధికారులు చెప్పలేక పోతున్నారు. అందుకు కారణం  నారాయణపూర్ రిజర్వాయర్ నుండి ఎంత నీటిని వదిలారో తెలియాల్సి ఉంది.

Leave a Reply