బయటపడ్డ నదీ అవశేషాలు..

సౌరకుటుంబంలో జీవాన్వేషలో భాగంగా ప్రపంచ శాస్త్రవేత్తలు అంగారక గ్రహాన్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పొడిగా, చల్లగా ఉన్న అంగారక గ్రహం ఒకప్పుడు వెచ్చటి వాతావరణంతో జీవానికి అనుకూలంగా ఉండేదని శాస్త్రజ్ఞులు తేల్చారు. యూనివర్సిటీ కాలేజ్ అఫ్ లండన్ పరిశోధకులు ‘అరేబియా టెర్రా’గా పిలువబడే అంగారక గ్రహం ఉత్తర ప్రాంతంలో పురాతన నదీ అవశేషాలను గుర్తించారు. ఈ నది దాదాపు 400 సంవత్సరాలకు ముందు ప్రవహిన్చేదని వారు ధ్రువీకరించారు. నాసా స్పేస్ క్రాఫ్ట్, మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్(ఎమ్ఆర్ఓ) అందించిన వివరాలను పరిశీలించిన మీదట యూనివర్సిటీ అఫ్ లండన్ పరిశోధకులు అరుణ గ్రహం జీవానికి అనుకూలంగా ఉండేదని వెల్లడించారు. తాజా పరిశోధనలు శాస్త్రజ్ఞులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి అనడంలో సందేహం లేదు.

Leave a Reply