రేటింగ్స్ కోసం పాకిస్తాన్ ఛానల్ ఘనకార్యం

అబ్దుల్ సత్తార్ ఏథీ పాకిస్తాన్ ప్రఖ్యాత మానవతా మూర్తి.ఆయన 92 ఏళ్ల వయసులో మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించారు.గుజరాత్ లో పుట్టిన ఈయన 1947లో పాకిస్తాన్ కు వలస వెళ్లారు. ఆయన తమ తల్లి కి వైద్యసేవలను అందించలేక తన తల్లి మరణించింది.ఆ సంఘటనే అతన్ని సేవామార్గం వైపు నడిపింది.ఎథీ ఫౌండేషన్ పేరుతో దేశవ్యాప్తంగా అంబులెన్సు సేవలు, వైద్య శిబిరాలు నిర్వహించేవారు.భారత్ మూగ బాలిక గీత బాల్యం నుంచి సంరక్షించి, పెంచిన ఈదీ అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కారు. ఆయన మరణం పాకిస్తాన్ దేశ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే పాకిస్తాన్ మీడియా చానల్ రిపోర్టర్ ఏథీ కోసం సిద్ధం చేసిన సమాధి లోకి వెళ్లి పడుకుని లైవ్ రిపోర్ట్ ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఒకవైపు ఆయన మరణంతో దేశమంతా బాధ పడుతుంటే ఇలాంటి పిచ్చిపనులు చేస్తూ మీడియా రేటింగ్స్ కోసం ఆరాటపడుతుందని ట్విట్టర్ లో విమర్శలు వెల్లువెత్తాయి.

Leave a Reply