ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..

ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లో ముఖ్యంగా పాతబస్తీలో పాతుకుపోయిన పార్టీ. పాతబస్తీకి మాత్రమే పరిమితం అయిన ఈ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించాలనుకుంటుంది. అయితే ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు మహారాష్ట్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. రాజకీయ పార్టీగా ఎంఐఎంకు మహారాష్ట్రలో గుర్తింపును రద్దు చేసింది. దాంతో మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పాల్గొనే అవకాశం లేకుండా పొయింది. 2014లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే నాందేడ్, ఔరంగాబాద్ కార్పోరేషన్లను సైతం గెలుచుకుంది. కాగా ఎన్నికల కమీషన్ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని, ఎన్నికల కమీషన్ నిర్ణయం వెనుక రాజకీయ వత్తిళ్ళు ఉండొచ్చు అని ఎంఐఎం నాయకులు ఆరోపిస్తున్నారు. మరో వైపు ఎన్నికల కమీషన్ మాత్రం ఎంఐఎం పార్టీకి సంబంధించిన, నిధులు ఆదాయ వివరాలను సమర్పించనందుకే నిషేధించాం అని పేర్కొంది.

Leave a Reply