ఆత్మహత్య చేసుకున్న యువకుడు…

స్త్రీలపై అత్తగారింట్లో జరుగుతున్న ఆకృత్యాలను, హింసలను అరికట్టేందుకు 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం గృహ హింస చట్టాన్ని తీసుకు వచ్చింది. అయితే చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నట్లు, ఆడ వారు మగ వారిని బ్లాక్ మెయిల్ చేసేలా చట్టం ఉందంటూ అప్పట్లోనే దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు జరిగిన పరిణామాన్ని చూస్తే ఆ విమర్శలు నిజమేననపించక మానదు. పంజాబ్ లోని సుల్తాన్ పుర్ కు చెందిన తరుణ్ కుమార్(28) జలంధర్ కు చెందిన రాజేందర్ పరదేశి కూతురు రచంజీత్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. అనతరం అతనిపై అమ్మాయి కుటుంబ సభ్యులు గృహ హింస చట్టం కింద కేసు పెట్టి అతన్ని మానసికంగా హింసించా సాగారు. అలాగే డబ్బులు కూడా డిమాండ్ చేశారు. శారీరకంగా కూడా హింసించినట్లు తెలుస్తుంది. దాంతో విసుగు చెందిన తరుణ్ కుమార్ ఆత్మహత్యకు ఒడి గట్టారు. ఆత్మహత్యను వీడియో తీసి ఆత్మహత్యకు గల కారణాలను అందులో వివరించారు. వీడియోను చుసిన అతని స్నేహితుడు వెళ్ళి రక్షించే లోపే అతను చనిపోయాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply