చెదిరిన మేరీకోమ్ కల..!

ఐదు సార్లు బాక్సింగ్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన మేరీకోమ్ ఆశలు గల్లంతు అయ్యాయి. రియో ఒలింపిక్స్ కోసం చివరి వరకు ప్రయత్నించిన మేరీకోమ్ కు నిరాశ ఎదురయింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రెండో రౌండ్ లోనే మేరీకోమ్ వెనుదిరగడంతో మేరీకోమ్ రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించలేక పోయారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అయిన అవకాశం లభిస్తుందేమోనని ఆశ పడ్డ మేరీకోమ్ కు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం షాక్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం చివరి రెండు ఒలింపిక్స్ లో ఎనిమిది కంటే ఎక్కువ బాక్సర్లు పాల్గొన్న దేశానికి వైల్డ్ కార్డు ఇవ్వడం కుదరదు. గత రెండు ఒలింపిక్స్ లో కలిపి భారత్ నుండి 14 మంది బాక్సర్ లు పాల్గొనడంతో మేరీకోమ్ కు చుక్కెదురైంది. కాగా ఈ వార్త విన్న వెంటనే తన గుండె బద్దలైంది అని మేరీకోమ్ పేర్కొన్నారు. బాక్సింగ్ ను ఇప్పట్లో వదిలేది లేదని మేరీకోమ్ తెలిపారు.

Leave a Reply