మరో రెండు సంవత్సరాలలో..

మెదక్ జిల్లాలోని పాతూర్ లో తెలంగాణ హరీష్ రావు మెదక్- అక్కన్న పేట రైల్వే లైన్ పనులకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, మెదక్ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్ ఏర్పాటు, మినీ ట్యాంకు బండ్ నిర్మాణం అలాగే 50 కోట్లతో మెదక్ పట్టణానికి మిషన్ భగీరథ వంటి పథకాలతో మెదక్ జిల్లా దశ తిరిగినట్లే అని మంత్రి హరీష్  రావు అభిప్రాయ పడ్డారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ చేసి, మొత్తం పరిహారంలో సగం భరించిందని హరీష్ రావు పేర్కొన్నారు. రెండు సంవత్సరాలలో రైల్వే లైన్ ను పూర్తి చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. అలాగే ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తీరుతామని హరీష్ రావు తెలిపారు.

Leave a Reply