టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు ఏమి చేశారు?

హైదరాబాద్ లో శనివారం మీడియా ,తో మాట్లాడిన తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్రావు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసి ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన గతి మాకు పట్టలేదని అన్నారు..ఆయనకి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కులేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నప్పుడు దిగ్విజయ్ ఏం చేశారని ప్రశ్నించారు.ఏదో ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధినిఅడ్డుకోవాలని చూసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. గనులు, నీటిపారుదలశాఖలపై సమీక్ష నిర్వహించిన మంత్రి హరీష్ రావు ప్రాజెక్టుల కోసం ఇసుక రీచ్‌లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్లు అందుబాటులో ఉండాలని అలాగే రంగనాయకి, అనంతగిరి ప్రాజెక్టులకు 7 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించాలని ఆదేశించారు. వీలైనంత త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

Leave a Reply