ఏటిగడ్డ,కృష్ణాపూర్ ను దత్తత తీసుకుంటాం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభుత్వానికి,ముంపు గ్రామాల నిర్వాసిత ప్రాంత ప్రజలకు మధ్య ఉన్న విబేధాలు పూర్తిగా తగ్గాయి.గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతాలు, అలాగే అధికార పక్షం ఇచ్చిన హామీల నడుమ కొట్టుమిట్టాడిన ఏటిగడ్డ ప్రజలు చివరకు ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.ఈరోజు మధ్యాహ్నం ఏటిగడ్డ ప్రజలతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలతో చర్చించారు.123 జిఓ ప్రకారమే భూములు ఇచ్చేందుకు గ్రామస్తులను ఒప్పించడంలో మంత్రి హరీష్ రావు పూర్తిగా సఫలమయ్యారు. ఎకరానికి రూ.6లక్షలు ఇచ్చేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీగా గ్రామప్రజలు అంగీకారం తెలిపారు.ఏటిగడ్డ,కృష్ణాపూర్ ను దత్తత తీసుకుంటామని మంత్రి హరీష్ రావు చెప్పారు.ఏటిగడ్డ,కృష్ణాపూర్ ప్రాంత ప్రజలు అంగీకరించి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒప్పుకున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply