సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయండి..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో తెలంగాణ ఐటి మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలో నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో ఇప్పటికే మొదలైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రస్తుతం అవి ఉన్న స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ నగరంలో ఇల్లు లేని పేదవారికి, బస్తీల్లో ఉన్నవారి కోసం ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందని తెలిపారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అర్హులైన వారికి ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply