400 మంది అలాగే మరణించారు..

మాములుగా ప్రభుత్వాలు మత విశ్వాసాలకు, మూడ నమ్మకాలకు దూరంగా ఉంటాయి. ఒకవేళ వారికి వ్యక్తిగతంగా అటువంటి నమ్మకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అధికారికంగా అటువంటి వాటిని ప్రోత్సహించదు. అయితే మధ్య ప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ అసెంబ్లీ సాక్షిగా అందరిని దిగ్ర్బాంతికి గురి చేసే ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్ లో గత రెండున్నరేళ్ళలో దాదాపు 400 మంది అకారణంగా, అకాల మృత్యు వాత పడ్డారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మరణాలపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు హోం మంత్రి భూపేంద్ర సింగ్ సమాధానం ఇస్తూ కొందరి మరణాలకు దెయ్యాలే కారణం అంటూ అధికారిక ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అలాగే మరికొందరి మరణాలకు చేతబడి కూడా కారణం అని తెలిపారు.  హోం మంత్రి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. హోం మంత్రి మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులు చెప్పినందు వల్లే తాను అలా ప్రకటించానని తెలిపారు.

Leave a Reply