మరి ‘నెపోలియన్’ ఎవరిది…?

గత కొన్ని రోజులుగా చిరంజీవి 150 చిత్రం టైటిల్ నెపోలియన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన పోస్టర్లు కూడా హడావుడి చేస్తున్నాయి.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి’ చిత్ర రచయిత ఆనంద్ రవి ప్రస్తుతం దర్శకుడిగా మారి తీస్తున్న నూతన చిత్రం ‘నెపోలియన్’ అని అధికారికంగా ప్రకటించారు. మొత్తం నూతన నటీనటులతో ఒక సామాజిక సందేశాత్మక చిత్రంగా నెపోలియన్ తెరకేక్కుతుందని ఆనంద్ రవి వెల్లడించారు. సిద్దార్థ్ సదాశివుని సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ పై భోగేంద్ర గుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మీరు చుడండి.

nepolian movie 1st look

Leave a Reply