నగర ప్రజలకు శుభవార్త..!

భారత దేశంలో ఐటికి కేరాఫ్ గా నిలిచే బెంగుళూరు పట్టణానికి సంబంధించిన ఒక విషయంలో కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటి ఉద్యోగుల సౌకర్యార్థం ఇక నుండి బెంగుళూరులో రాత్రి 1 గంట వరకు పబ్బులు, బార్లు తెరిచి ఉండబోతున్నాయి. గతంలో 11 గంటలవరకు ఉన్న సమయాన్ని, కర్ణాటక ప్రభుత్వం మరో రెండు గంటలు పెంచి మరింత ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వారాంతంలో ప్రయోగాత్మకంగా 1 గంట వరకు పబ్బులు, బార్లు తెరిచి పరిశీలించనుంది. తర్వాత ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారి చేసే అవకాశం ఉంది. దీనిపై సామాజిక కార్యకర్తలు, మేధావులు మండి పడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. అలాగే పోలీసులు కూడా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే దీని వల్ల దొంగతనాలు, దోపిడిలు, అత్యాచారాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నట్లు వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply