ప్రపంచ రెండో ర్యాంకర్ పై గెలుపు.. సెమిస్ లోకి భారత షట్లర్…

రియో ఒలింపిక్స్ మొదలై దాదాపుగా పది రోజులు కావొస్తున్న ఇప్పటి వరకు భరత్ పతకాలకు చాలా దూరంలోనే నిలిచి పొయింది. ఖచ్చితంగా పతకాలు సాదిస్తారనుకున్న సానియా మీర్జా, సైనా నెహ్వాల్ వంటి వారు రిక్త హస్తాలతోనే వెనుదిరిగారు. కానీ అంచనాలు ఏ మాత్రం లేని క్రీడాకారులు ఆదరగోట్టేస్తున్నారు. దీపా కర్మాకర్ త్రుటిలో పతకం చేజార్చుకున్నప్పటికి దేశ వ్యాప్తంగా అందరు ఆమెను అభినందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత షట్లర్ పీ.వీ. సింధు అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ బాడ్మింటన్ లో సెమీఫైనల్ కు చేరుకుంది. అది కూడా ఏకంగా ప్రపంచ నెంబర్ 2 క్రీడాకారిణి, చైనా దిగ్గజం వాంగ్ ఇహాన్ క్వార్టర్ ఫైనల్లో ఓడించడం గమనార్హం. హోరాహోరిగా సాగిన ఈ పోరులో సింధు 22-20, 21-19లతో వరుస సెట్లను గెలిచి సెమి ఫైనల్లోకి అడుగు పెట్టింది. గేమ్ ఆసాంతం సుదీర్ఘ ర్యాలీలు జరిగిన ఏమాత్రం అలసిపోకుండా, చక్కని ప్లేస్ మెంట్లు, డ్రాప్ లతో ప్రత్యర్థిని మట్టి కరిపించింది. రేపు జరిగే సెమి ఫైనల్ పోటిలో సింధు జపాన్ కు చెందిన నోజోమి ఓకుహార తో అమీతుమీ తెల్చుకుంటుంది. ఈ మ్యాచ్ లో భారత్ కు పతకం ఖాయం. ఒకవేళ ఓడినా కూడా కాంస్య పతకం కోసం జరిగే పోరులో పోటి పడాల్సి ఉంటుంది.

Leave a Reply