ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2015 – రాజమౌళి

ప్రతి సంవత్సరం సిఎన్ఎన్ ప్రకటించే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దర్శక దిగ్గజం రాజమౌళి సొంతం అయింది. 2015 సంవత్సరానికిగాను ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ సినిమాకు ఖ్యాతి తీసుకువచ్చినందుకు ఈ అవార్డు ఇస్తున్నట్లు సిఎన్ఎన్ ప్రకటించింది. ఈ అవార్డు కోసం పోటిలో ఉన్న రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా,సంజయ్ లీలా బన్సాలీ, దీపిక పడుకునే వంటి బాలీవుడ్ ప్రముఖులు పోటిలో ఉన్నప్పటికీ ఆన్ లైన్ లో ఎక్కువ ఓట్లు రాజమౌళికి దక్కాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఈ అవార్డును రాజమౌళి అందుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ అవార్డు మొత్తం బాహుబలి బృందానికి చెందుతుంది అని, తనకు మాత్రమే వచ్చిన అవార్డు కాదని రాజమౌళి అంటూ రాజమౌళి మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నాడు. ఈ అవార్డు రాజమౌళిపై మరింత భాద్యతను పెంచుతుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి-2 మున్గింపు సన్నివేశాలను మరింత అధ్బుతంగా తెరకెక్కించే అవకాశం ఉంది. టాలీవుడ్ లో ఏ దర్శకుడు సాధించనన్ని విజయాలు సాధించడమే కాకుండా అరుదైన గౌరవాలను కుడా అందుకుంటూ టాలీవుడ్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

Leave a Reply