వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు..

రియో ఒలింపిక్స్ ముగిశాయి. భారత్ ఖాతాలో ఒక రజతం, ఒక కాంస్య పతకాలు జమ అయ్యాయి. పతకాల పట్టికలో భారత్ 67వ స్థానంలో నిలిచింది. అమెరికా 121 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్, చైనా దేశాలు నిలిచాయి. దీనిపై వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క రజతం సాధించినందుకే మేరా భారత్ మహాన్ అంటున్నారు, 46 బంగారు పతకాలు, 37 రజత పతకాలు సాధించిన అమెరికా ఎంత గర్వపడాలి అని ప్రశ్నించారు. అలాగే 5 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా ఎంత గర్వపడాలి అని ప్రశ్నించారు. 32 కోట్ల జనాభా ఉన్న అమెరికా 121 పతకాలు సాధిస్తే, 120 కోట్లకు పైగా ఉన్న భారత్ ఒక్క రజత పతకం సాదిస్తే ఇంక్రెడిబుల్ ఇండియా అంటున్నారని, అదే అమెరికా సాధించినన్ని పతకాలు సాధిస్తే ఏమని పిలిచేవారోనని వర్మ వ్యాఖ్యానించారు. అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ram gopal varma twits on olympic medals

Leave a Reply