రజనీకాంత్ నటనపై వర్మ సంచలన వ్యాఖ్యలు..

నిత్యం వివాదాలు సృష్టించే రామ్ గోపాల్ వర్మ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ తో ప్రస్తుతం సర్కార్ 3 సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రామ్ గోపాల్ వర్మ, ఆయనను పొగిడే క్రమంలో ట్విట్టర్ లో  రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తీన్ లాంటి సినిమాలు తీస్తే ఎవరూ చూడరని, అదే అమితాబ్ కనుక రోబో లాంటి సినిమా చేస్తే ఇంకా పెద్ద విజయం సాధించేదని వర్మ పేర్కొన్నారు. రజనీకాంత్ కనుక తీన్, పీకూ, బ్లాక్ లాంటి సినిమాలు తీస్తే నవ్వుల పాలవడం ఖాయం అన్నారు. అలాగే తీన్ సినిమా రజనీ తీస్తే ఒక మార్క్ పడుతుందని, అదే కబాలి సినిమాను అమితాబ్ బచ్చన్ తీస్తే 100 మార్కులు పడతాయని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై రజనీకాంత్ స్పందించాలని వర్మ పేర్కొనడం గమనార్హం.

Leave a Reply