Ringing Bells Delivering phones from 28th june

ప్రపంచంలోనే అతి చవగ్గా 251 రూపాయలకే, ఫ్రీడమ్ 251  మొబైల్ ఫోన్ అందిస్తామని ప్రకటించిన రింగింగ్ బెల్స్ సంస్థ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కింద బుక్ చేసుకున్న వినియోగదారులకు ఈ నెల 28 నుండి ఫోన్ లను అందిస్తామని రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించింది. మొత్తం 7 కోట్ల మంది మొబైల్ ఫోన్ కోసం బుక్ చేసుకోగా, మరో 30 వేల మంది డబ్బులు చెల్లించి మరి బుక్ చేసుకున్నారు. ఐతే ఇప్పుడు రింగింగ్ బెల్స్ సంస్థ క్యాష్ ఆన్ డెలివరీ కింద బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఫోన్ అందించబోతున్నట్లు ప్రకటించడంతో ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారు తీవ్ర నిరుస్తాహానికి గురవుతున్నారు. మరో వైపు రింగింగ్ బెల్స్ ప్రతినిధులు మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ కింద బుక్ చేసుకున్న వారికి ఫోన్ ఇవ్వడం ద్వారా మిగతా వారి అనుమానాలను పటాపంచలు చేయొచ్చని భావిస్తున్నారు.

Leave a Reply