క్రికెట్ నుండి చాలా తీసుకున్నాను…!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. వ్యాపారవేత్తగా మారిన సచిన్ అనేక కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సచిన్ తాజాగా క్రీడా వస్తువులను తయారు చేసే సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సచిన్ క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని, ఎంతో కొంత క్రికెట్ కు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. తాను ఆడుతున్నప్పుడు ఎన్నోసార్లు గాయపడ్డాను అని, అందుకోసం క్రీడాకారులకు రక్షణనిచ్చే పరికరాలైన హెల్మెట్స్, గ్లోవ్స్, లెగ్ గార్డ్స్ ను  మరింత నాణ్యవంతంగా రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం ఆస్ట్రేలియాకు చెందిన ‘స్పార్టన్ ఇంటర్నేషనల్’ తో కలిసి పనిచేయనున్నట్లు సచిన్ పేర్కొన్నారు. కాగా సచిన్ మార్క్ కనపడే సరికొత్త ఉత్పత్తులు అక్టోబర్ 1 నుండి మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply