చిక్కుల్లో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’…!

రంజాన్ పండగ సందర్భంగా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ సునామీ సృష్టిస్తున్న సల్మాన్ ఖాన్ తాజా చిత్రం సుల్తాన్ ఇప్పుడు మరో వివాదంలోకి వెళ్ళింది. ఈ చిత్ర కథ తన జీవిత కథ ఆధారంగా తీశారని, అందుకు తనకు 20 కోట్లు ఇస్తామని సల్మాన్ ఖాన్ మాట ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వడం లేదని ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ కు చెందిన ముహమ్మద్ సబీర్ అన్సారీ అనే వ్యక్తి కోర్ట్ లో కేసు వేశారు. 2010లో తాను వ్రాసుకున్న జీవిత కథను సల్మాన్ ఖాన్ కు వినిపించాను అని, విన్న సల్మాన్ ఆ కథతో సినిమా తీస్తాను అని చెప్పారని, అందుకు 20 కోట్లు ఇస్తాను అని మాట ఇచ్చారు అని, సినిమా విడుదలైన తర్వాత తనకు డబ్బులు ఇవ్వడం లేదని సబీర్ అన్సారీ తన పిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు 420,406,504,506 సెక్షన్ల కింద సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ,నిర్మాత ఆదిత్య చోప్రా,దర్శకుడు అలీ అబ్బాస్ లపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 26 న కేసు విచారణకు రానుంది. విచారణలో గనుక సుల్తాన్ టీం దోషులుగా తేలితే భారిగా జరిమానా పడే అవకాశం ఉంది.

Leave a Reply