ప్రేమ..పెళ్ళిగా మారబోతుందా..?

ప్రస్తుతం తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆమె ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సరసన జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సమంతే ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. సమంత, నాగ చైతన్య ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నారని, వారు పెళ్ళి చేసుకునేందుకు నాగ చైతన్య తండ్రి నాగార్జున అనుమతి ఇచ్చారు అని సమాచారం. అందుకనే ప్రస్తుతం సమంత కొత్తగా ఏ సినిమాలు ఒప్పుకోవడం లేదని సమాచారం. అయితే పెళ్లి తర్వాత కూడా నటిస్తానని సమంత నటిస్తానని స్పష్టం చేసింది, కాని గ్లామర్ రోల్స్ మాత్రం చేయనని తెలిపింది.

Leave a Reply