ఆందోళన కలిగిస్తున్న దేశ రక్షణ..

భారత దేశ రక్షణ వ్యవస్థ అనుమానాస్పదంగా మారింది. ముఖ్యంగా తీర ప్రాంత రక్షణలో కీలకమైన, సున్నితమైన సమాచారాన్ని  లీక్ చేశారు. అది కూడా 22,400 పేజీల సమాచారం భయటకు వచ్చింది. భారత తీరప్రాంత రక్షణను పటిష్టం చేసుకునేదుకు ముంబైలో ఫ్రాన్స్నౌకా నిర్మాణ సంస్థ డీసీఎన్ఎస్ సహకారంతో భారత్ ఆరు అత్యంత ఆధునిక స్కార్పీన్ జలాంతర్గాములు నిర్మిస్తుంది. వాటికి సంబంధించిన 22,400 పేజిల సమాచారం భయటకు వచ్చింది. దీన్నిలో ఫ్రాన్స్ కు చెందిన నావీ అధికారి ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. భయటకు వచ్చిన సమాచారంలో స్కార్పీన్ లకు సంబంధించన పూర్తి సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం బయటకు రావడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దేశ రక్షణకు విఘాతం కలిగితే ప్రభుత్వ పెద్దలు జవాబు చెప్పకపోవటం బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

Leave a Reply