భాజాపా మిత్రపక్షం ఆసక్తికర వ్యాఖ్యలు..

పాకిస్థాన్ లోని బెలుచిస్థాన్ ప్రాంతంలో పాకిస్థాన్ చేస్తున్న దమనకాండను ఆగష్టు 15న ఎర్రకోట సాక్షిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మోడీ చేసిన ప్రకటనతో బెలుచిస్థాన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వారంతా మోడీకి మద్దతుగా ప్రకటనలు కుడా చేశారు. దాంతో పాకిస్థాన్ ప్రభుత్వం బలూచ్ నేతలను అరెస్ట్ చేయడం మొదలు పెట్టింది. దీనిపై భాజాపా మిత్ర పక్షం శివసేన తన అధికార పత్రిక సామ్నాలో స్పందించింది. మోడీ వ్యాఖ్యలను సమర్థించినందుకు బలూచ్ నేతలు భారీ మూల్యం చెల్లిస్తున్నారని శివసేన వ్యాఖ్యానించింది. బలూచ్ నేతలను రక్షించడానికి మోడీ సైన్యాన్ని పంపిస్తారా అని ప్రశ్నించింది. కశ్మీర్ లో పాకిస్థాన్ జెండాలను ఎగరవేస్తున్న వారిని ఏం చేస్తారని ప్రశ్నించారు. అలాగే వేర్పాటు వాదులతో చర్చలు జరిపిన కశ్మీర్ ముఖ్యమంత్రిని ఏం చెబుతారని శివసేన ప్రశ్నించింది.

Leave a Reply