గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు అరుదైన గౌరవం..

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డు అయిన ‘గ్రేట్ ఇమ్మిగ్రేట్స్: ది ప్రైడ్ అఫ్ అమెరికా’ అవార్డును సుందర్ పిచాయ్ అందుకోబోతున్నారు. అమెరికాకు వలస వచ్చిన వారికి ఇచ్చే ఈ అవార్డుకు ఈ సంవత్సరం 42 మంది ఎంపికయ్యారు. వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. వీరంతా అమెరికా సంస్కృతిలో కలిసిపోయారని, ఒక సగటు అమెరికన్ పౌరుడు ఏ విధంగా అయితే అమెరికాను ప్రేమిస్తున్నాడో అదేవిధంగా వీరు కూడా అమెరికాను ప్రేమిస్తున్నారు అని, అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నారని అవార్డు ప్రకటించిన జ్యూరీ పేర్కొంది.

Leave a Reply