లేదంటే ఆయనను జైలుకు పంపిస్తా..

[pullquote]తెలంగాణను మహారాష్ట్రకు తాకట్టు పెట్టామని , తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ 152 మీటర్ల నుండి 148 మీటర్లకు తగ్గించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, ఆయన తన వ్యాఖ్యలను నిరూపిస్తే రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేస్తానని నిరుపించాకపోతే ఉత్తమ్ ను జైలుకు పంపిస్తామని కేసీఆర్ తెలిపారు[/pullquote]మహారాష్ట్రతో చారిత్రిక ఒప్పందం చేసుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. [pullquote]మహారాష్ట్రతో చారిత్రిక ఒప్పందం చేసుకునేందుకు కృషి చేసిన హరీష్ రావుకు ఈ సందర్భంగా కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు[/pullquote]తెలంగాణాలో అభివృద్ధి జరగకుండా కాంగ్రెస్ చిక్కిరి బిక్కిరి చేష్టలు చేస్తుందని, టీడీపీ కంపెనీ అడ్డుకుంటుందని విమర్శించారు. ప్రతి పక్షాలకు భాద్యత లేదని, తెలివి లేదని, అవగాహన లేదని పేర్కొన్నారు. తెలంగాణను మహారాష్ట్రకు తాకట్టు పెట్టామని , తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ 152 మీటర్ల నుండి 148 మీటర్లకు తగ్గించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, ఆయన తన వ్యాఖ్యలను నిరూపిస్తే రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేస్తానని నిరుపించాకపోతే ఉత్తమ్ ను జైలుకు పంపిస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణకు 950 టీఎంసీ ల గోదావరి నీటి కేటాయింపులు చేశారని, గోదావరిలో మరో 3000 టీఎంసీల నీటి లభ్యత ఉందని, అందులో 1500 నికర, 1500 మిగులు జలాల లభ్యత ఉందని, అందులో వాటా కోసం ఇరిగేషన్ శాఖ మంత్ర హరీష్ రావు నేతృత్వంలో త్వరలో ఎంపీల బృందంతో ఢిల్లీ వెళ్తామని, మరో 700-800 టీఎంసీల నీటిని సాధిస్తామని తెలిపారు. రెండున్నరేళ్ళలో కాంగ్రెస్ ఎప్పుడు కలిసి రాలేదని, ఉద్యమాన్ని విచ్చిన్నం చేయాలని చంద్రబాబు, వైఎస్ఆర్ కుట్రలు పన్నుతుంటే, కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పాకులాడారని విమర్శించారు. వారు చెబుతున్నట్లు 98 లక్షల ఎకరాలకు నీరండితే ఉద్యమం ఎందుకు వచ్చేదని ప్రశ్నించారు. చరిత్రలో లేని విధంగా అవినీతి రహిత పాలన అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రతో చారిత్రిక ఒప్పందం చేసుకునేందుకు కృషి చేసిన హరీష్ రావుకు ఈ సందర్భంగా కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

Leave a Reply