వ్యాపారానికి తెలంగాణ అత్త్యుత్తమ రాష్ట్రము

తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. కేంద్రం ప్రకటించిన వ్యాపారానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో  తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం సంపాదించింది. ఇక్కడ వ్యాపారానికి లేదా పరిశ్రమలు స్థాపించడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టీఎస్ ఐపాస్ విధానం ద్వారా రాష్ట్రంలో అనేక నూతన పరిశ్రమలు స్థాపించబడ్డాయి. దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. అలాగే మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా మూడవ స్థానం సంపాదించింది. నూతన రాజధానిలో పెట్టుబడులకు అనేక అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర జాబితాలో గౌరవప్రదమైన స్థానం సంపాదించింది.

Telangana state No.1 rank in Ease of Doing Business

Telangana state No.1 rank in Ease of Doing Business

Leave a Reply