కుట్రను చేధించిన పోలీసులు.. పోలీసుల అదుపులో ఉగ్రవాదులు..!

హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు భారీ కుట్ర పన్నిన్నట్లు తెలుస్తుంది. ఇస్తాంబుల్ లో జరిగిన పేలుళ్ళ తరహాలోనే హైదరాబాద్ లో కూడా పేలుళ్ళకు తీవ్రవాదులు పథకం పన్నినట్లు తెలుస్తుంది. అయితే తీవ్రవాదుల పథకాలను ఎన్ఐఏ అధికారులు తిప్పి కొట్టారు. నగరంలోని పాతబస్తీలో ఐఎస్ఐఎస్ సానుభూతి పరులైన 13 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటుగా భారీగా విదేశీ కరెన్సీని, పేలుడు పదార్థాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు ముందు అరెస్ట్ చేసిన నిక్కి జోసెఫ్ అనే తీవ్రవాది ద్వారా ఎన్ఐఏ అధికారులు ఈ కుట్రను చేధించినట్లు సమాచారం. పాతబస్తీలో ఇంకా పోలీసుల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply