రోజుకు 100 కోట్ల రూపాయల వ్యాపారం..

హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామని పాలకులు చెబుతున్నప్పటికీ,విశ్వనగరం మాటేమో గాని, చీకటి నగరం మాత్రం అవుతుంది. ఇప్పటికే దేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన వాటి మూలాలు నగరంలోనే బయటపడుతున్నాయి. అనేక డ్రగ్ రాకెట్స్ బయటపడుతున్నాయి.పట్ట పగలు విద్యార్థులు మద్యం సేవించి విచ్చలవిడిగా విహరించి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అలాగే ప్రభుత్వం నిషేధించిన అనేక వ్యాపారాలు నగరంలో దర్జాగా సాగిపోతుంటాయి. అందుకు ఉదాహరణ ప్రభుత్వం నిషేధించిన ‘గుట్కా’ అమ్మకాలు నగరంలో విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతాల్లో. ఇళ్ళ మధ్యనే వాటి గోడౌన్ లను ఏర్పాటు చేసి, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఒక్క రోజులోనే 100 కోట్ల పైచీలుకు వ్యాపారం జరుగుతుంటుంది. పోలీసులు కూడా వారు ఇచ్చే మాముళ్ళకు ఆశ పడో, లేక స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లో చూసి కూడా చూడనట్లు వదిలేస్తున్నారు. ప్రతి వారం కార్టన్ సెర్చ్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతుంటారు అయితే ఆ కార్టన్ సెర్చ్ లో ఎవరిని అదుపులోకి తీసుకున్నారు, ఏమేమి స్వాధీనం చేసుకున్నారో మాత్రం వెల్లడించరు. ఎదో తూతూ మంత్రంగా సోదాలు చేస్తుంతారని స్థానికులు చెబుతుంటారు. అలాగే నగరంలోని ఎన్నో పబ్బులలో డ్రగ్స్ అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. వాటిని కూడా చూసి చూడనట్లు వదిలేస్తారు. నగరంలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ప్రభుత్వం కూడా రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా ఆయా ప్రాంతాల్లో ఏమి చేయలేకపోతుంది.ఇలాగే కొనసాగితే విశ్వనగరం మాట అటుంచి, ఇక్కడ సామాన్య ప్రజలు కూడా బ్రతకలేని పరిస్థితి వస్తుంది.

Leave a Reply