టైటిల్ తోనే ఆకట్టుకుంటున్న వెంకీ..

విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ కథలు చేయడంలో తిరుగులేని పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో నటించిన బాబు బంగారం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ ‘నేను శైలజ’ చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే టైటిల్ పెట్టారు. అక్టోబర్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కథ రిత్యా ఆరుగురు హీరొయిన్లు నటించనున్నారు. పీఆర్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు.

Leave a Reply