ఆంధ్రాలో బోర్డు తిప్పేసిన ఐటి కంపెనీ…!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఐటి వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. అయితే ఐటికి చెడ్డపేరు తీసుకువచ్చే విధంగా కొన్ని కంపెనీలు ప్రవర్తిస్తున్నాయి. విశాఖపట్నంలో ఒక ఐటి కంపెనీ చేసిన మోసానికి దాదాపు 30౦ మంది బాధితులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇక వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలో ఇదు నెలల క్రితం కిరణ్ కుమార్ అనే వ్యక్తి ‘ఎక్సాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఐటి కంపెనీని మంత్రి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఐటి శిక్షణ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం అని అప్పుడు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత నుండి 60 వేల నుండి లక్ష వరకు తీసుకున్నారు. ఆరు నెలలు శిక్షణ ఉంటుందని చెప్పి ఐదు నెలల తర్వాత బోర్డు తిప్పేశారు. దాంతో డబ్బులు కట్టిన 300 మంది నిరుద్యోగ యువత తాము మోసపోయినట్లు గుర్తించారు. అనంతరం కిరణ్ కుమార్ పై పీఎం పాలెం పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు స్వీకరించిన అనంతరం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Leave a Reply