ఎడిటోరియల్: జగన్ కు మద్దతు పలుకబోతున్న చిరంజీవి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఎటువైపు వెళ్తారో ఎవరు చెప్పలేక పోతున్నారు. మొన్నటి వరకు వైఎసార్సీపి నేతలు ఒక్కరుగా వెళ్లిపోతుంటే ఆ పార్టీ అధినేత జగన్ కుదేలయ్యారు. ఇప్పుడు తేరుకున్న జగన్ నష్ట నివారణ చర్యలకు దిగినట్లే కనపడుతున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద సామాజిక వర్గాలలో ఒకటైన కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాట్లు కనపడుతుంది. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేస్తున్న పోరాటం వెనుక జగన్ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముద్రగడ వెళ్లి జగను కలవడం కూడా తెలుగుదేశం వ్యాఖ్యలకు బలం చేకూరుస్తుంది. జగన్ ను కలిసిన తర్వాత ముద్రగడ దాసరి నారాయణ రావును కలవడం, ఆ తర్వాత జగన్, దాసరి నారాయణను కలవడం చూస్తుంటే ముద్రగడే జగన్, దాసరి మధ్య మధ్యవర్తిత్వం జరిపినట్లు కనిపిస్తుంది. అలాగే తర్వాత ముద్రగడ వెళ్లి చిరంజీవిని కలిశాడు. ఇప్పుడు చిరంజీవి, దాసరి నారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా చిరంజీవి, దాసరి మధ్య మధ్యవర్తిత్వం వహించింది ముద్రగడేనని స్ప్రుష్టంగా అర్థం అవుతుంది. భవిష్యత్తులో జగన్ తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు చిరంజీవి సంకేతాలు పంపించినట్లు ఈ సమావేశం ద్వారా అర్థం అవుతుంది. ఎందుకంటే మరో రెండు సంవత్సరాలలో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోతుంది. ఎలాగూ కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ,రాష్ట్రంలోను కోలుకునే సూచనలు కనిపించడంలేదు. అందుకే చిరంజీవి జగన్ వైపు చుస్తునాడనే వార్తలు వస్తున్నాయి.

Leave a Reply